by Suryaa Desk | Sat, Jan 25, 2025, 02:45 PM
వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందిస్తూ విజయసాయి రెడ్డి లాంటి ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల్లో ఉంటే వారు ఆర్థిక ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు.చేయాల్సిన తప్పులన్నీ చేసి తప్పించుకుంటానంటే కుదరదని శ్రీనివాస్ అన్నారు. చేసిన తప్పులకు చట్ట పరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవని, పవన్ కల్యాణ్ తో ఎప్పటి నుంచో పరిచయం ఉందని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ కూడా ఆర్థిక నేరారోపణలు ఉన్న వ్యక్తేనని చెప్పారు. రానున్న రోజుల్లో వైసీపీ దివాళా తీయడం ఖాయమని దీనికి నిదర్శనం ఏ2 రాజీనామా చేయడమేనని అన్నారు.
Latest News