by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:16 PM
వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాలకు రాజీనామా చేయడం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం టాపిక్‌గా నిలిచింది. విజయసాయి రాజకీయ సన్యాసంపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఆర్థిక, నేరగాళ్లు రాజకీయాల్లో ఉంటే, ఆర్థిక ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉంటుందన్నారు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని విమర్శించారు.ఇలాంటి వాళ్లు రాజకీయాల నుంచి బయటికి తప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి నేతలు పేర్లు చెప్పడం ద్వారా తనకు అందరూ తెలుసని, ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. తప్పులు చేసి తప్పించుకుంటానంటే కుదరదు.. చేసిన తప్పులకు చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు కూడా ఆర్థిక నేర ఆరోపణలు ఉన్న వ్యక్తి అని.. భవిష్యత్తులో వైసీపీ పార్టీ కూడా దివాలా తీయడం ఖాయమన్నారు. అందుకు నిదర్శనమే ఈ ఏ2 రాజీనామా అంటూ పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు.
Latest News