by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:25 PM
పరిశ్రమలకు కరెంట్ కోతల కష్టాలు వీడలేదు. పవర్ హాలిడేను పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఈ నెల 11నుంచి 22వ తేదీ వరకు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించారు. తిరిగి ఈ నెల 30వరకు పొడిగిస్తూ సవరణ ఉత్వరులు జారీ చేశారు. దీంతో చీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్ ఫ్యాక్టరీలకు గురు,శుక్రవారాల్లో పూర్తిగా కరెంట్ సరఫరా నిలిపివేస్తారు. మిగతా రోజుల్లో సాయంత్రం 6గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉన్నా ఉత్పత్తి ప్రక్రియకు ఉపయోగించకూడదు. అంటే మొత్తం మీద వారానికి 168 గంటలకు కేవలం 60గంటలు మాత్రమే కరెంట్ వినియేగించుకొనే అవకాశం ఫ్యాక్టరీలకు ఉంటుంది. దీంతో గ్రానైట్ పరిశ్రమకు ఇక్కట్లు కొనసాగుతున్నాయి. ఉత్పత్తి ప్రక్రియ దాదాపు 30శా తానికి పడిపోయింది. కార్మికులకు ఆదాయాలు సైతం గణనీయంగా తగ్గిపో యాయి. దీంతో వలస కార్మికులు ఇంటిబాట పడుతున్నారు.
Latest News