by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:26 PM
దర్శి ఆర్టీసీ పార్శిల్ సర్వీ్‌సలో దోపిడీ జరుగుతోంది. నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నారు. బిల్లులతోపాటు అదనంగా మరికొంత పిండుతున్నారు. దీంతో ప్రజలు తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేతితో పట్టుకుని పార్శిల్‌కు సైతం హమాలీ చార్జీలు వసూలు చేస్తుండడం గమనార్హం. కొన్ని సందర్భాల్లో సంబంధిత పార్శిళ్లు వేసే ప్రాంతాలకు వెళ్లి వచ్చినా అంత ఖర్చు కాదని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఒక వ్యక్తి విజయవాడకు 200 గ్రాముల బరువు కల్గిన పార్శిల్ పంపించగా రూ.47 ట్రాన్స్‌పోర్టు చార్జీలు, హమాలీ చార్జీలు రూ.15, ఇన్స్యూరెన్స్ చార్జీ రూ.5, ఎస్‌జీఎస్టీ రూ.6, సీజీఎ్‌సటీ రూ.6 మొత్తం రూ.80 బిల్లు వేశారు. నిర్వాహకుడు బిల్లుతోపాటు అదనంగా మరో రూ.10 కలిపి రూ.90 చెల్లించాడు. 200 గ్రాముల బరువు కల్గిన కవరుకు హమాలీ చార్జీలు, రెండు రకాల జీఎ్‌సటీలతో పాటు అదనంగా మామూలు వసూలు చేయటంతో ఆ వ్యక్తి విస్మయం వ్యక్తం చెందాడు. దర్శి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన పార్శిల్ సర్వీ్‌సలో నిత్యం ఈ దోపిడీ జరుగుతోంది. ఇక్కడకు ప్రతిరోజు వందలాది మంది పార్శిళ్లు వేసేందుకు వస్తుంటారు. అందరి వద్ద బిల్లులతో పాటు అదనపుంగా వసూలు చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Latest News