by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:27 PM
ప్రజా సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిష్కరించేందుకే ‘మన ఊరు- మన ఎమ్మెల్యే’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. మార్కాపురం 1వ వార్డులోని తూర్పువీధిలో శుక్రవారం కార్యక్ర మంలో భాగంగా పర్యటించారు. ఉదయం 6.30 గంటల నుంచి సుమారు మూడు గంటల పాటు వార్డులోని అన్ని ప్రాంతాల్లో తిరిగారు. ఈ సందర్బంగా ప్రజలు తెలియజేసి న సమస్యలను అక్కడికక్కడే అధికారులకు తెలిపి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా వార్డును ఆనుకుని ఉండే చెరువు పంట కాలువ మురికి నీటితో నిండి దుర్గంధం వెదజల్లుతున్నట్లు తెలుసుకున్నారు. అంతేకాక ఆ కాలువను ఆనుకుని ఉన్న దారి కుంచించుకుపోవడంతో పొలాల్లోకి రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు రైతులు తెలిపారు. వెంటనే కాలువను శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్ నారాయణ రావును ఎమ్మెల్యే కందుల ఆదేశించారు. అంతేకాక సర్వే చేసి ఆ దారిని పునరుద్ధరిం చాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అదే విధంగా వార్డు పరిధిలో సాగర్ పైప్‌లైన్ నిర్మించినా రహదారులకు మరమ్మతులు చేయని విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి ప్రజలు తీసుకెళ్లారు. పట్టణమంతా ఆ సమస్య ఉన్నందున పాత కాంట్రాక్ట్‌ను రద్దు చేసి నూతనం గా సీసీ రహదారిని నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగ అధికారుల ను ఎమ్మెల్యే కందుల ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, వక్కలగడ్డ మల్లిఖార్జున్, షేక్ మౌళాలి, మాలపాటి వెంకటరెడ్డి, నీటి సంఘం అధ్యక్షులు దగ్గుల శ్రీనివాసరెడ్డి, గుంటక వెంకటరెడ్డి, మారంరెడ్డి రామకృష్ణా రెడ్డి, పఠాన్ ఖాన్, మయూరి ఖాశిం, గులాబ్, దూపాటి యలమంద పాల్గొన్నారు.
Latest News