by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:34 PM
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నరసాపురం తీసుకొచ్చేందుకు నేతలు, అధికారులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం చెన్నై–విజయవాడ మధ్య నడుస్తున్న ఈ రైలును ఏడాది క్రితం భీమవరం వరకు పొడిగించాలని ప్రతిపాదించారు. అయితే ఈ రైలు నిర్వహణ కు ఇక్కడ సిబ్బంది, వాటర్ ఫిల్లింగ్‌కు అవసరమైన పైప్‌లైన్‌లు లేకపోవడంతో పెండింగ్ పడింది. ఎలాగైనా సదరన్ రైల్వేను ఒప్పించి నరసాపురం వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ప్రయత్నిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం చెన్నై–విజయవాడ మధ్య 20677 నెంబర్‌తో వందే భారత్‌ను నడుపుతున్నారు. ఇది చెన్నై లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి 11.30కి విజయవాడ చేరుతుంది. తిరిగి 20678 నెంబర్‌తో మధ్యాహ్నం 3.20 గంటల కు బయలుదేరి రాత్రి 9.30కి చెన్నై వెళుతుంది. ఉదయం చెన్నై నుంచి వచ్చి విజయవాడ స్టేషన్‌లో నాలుగు గంటలపా టు ఈ రైలు నిలిచిపోవడం వల్ల ప్లాట్‌ఫారం సమస్య తలెత్తుతోంది. విజయవాడ స్టేషన్‌లో రైళ్ల రాకపోకలు అధికం కావడంతో ఎక్కువ సేపు వందే భారత్ నిలిచిపోవడం వల్ల ప్లాట్‌ఫారాలు ఖాళీలేక కొన్ని సమయాల్లో కొన్ని రైళ్లను అవుటర్‌లో రెడ్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. దీనివల్ల రైళ్లు ఆలస్యానికి కారణమవుతున్నాయి. దీనిని గుర్తించిన రైల్వే ఈ ఎక్స్‌ప్రెస్‌ను పొడిగించాలని నిర్ణయించింది. ఏ స్టేషన్ వరకు పొడిగిస్తే ప్రయాణికుల డిమాండ్ ఉంటుందన్న దానిపై తర్జనభర్జనలు చేశారు. చివరికి భీమవరం స్టేషన్‌ను ఓకే చేశారు. అప్పటికే కొత్తగా డబ్లింగ్ లైన్ వేయడం వల్ల ట్రాక్ సామర్ధ్యం సరిపోవడం తో అంతా ఒకే అని భావించారు. అయితే భీమ వరం రన్నింగ్ స్టేషన్, ఇక్కడ రైళ్ల నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది ఉండరు. బోగీలకు నీరునింపే సదుపాయం ఈ స్టేషన్‌లో లేదు. వీటి ఏర్పాటు ఖర్చుతో కూడిన పని, వీటిని అధ్యయనం చేసి ప్రస్తుతం పెండింగ్‌లో పెట్టారు.
Latest News