by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:34 PM
రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు తగ్గుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొని మాట్లాడారు. అన్ని స్థాయిల్లో వ్యవస్థలో పద్ధతి ప్రకారం అన్ని పదవుల నిర్ణయం జరుగుతుందని చెప్పారు. అధికారంలో భాగస్వామ్యం ఉంది కనుక ప్రజల సమస్యలు తీర్చడంలో ముందున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు.సూర్యఘర్ ద్వారా ప్రతీ ఇంటికి ఆదాయ వనరుగా మార్చే పనులు చేస్తున్నామని తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. PPP మోడ్‌లో మెడికల్ కాలేజీలు తేవాల్సిన పరిస్ధితికి గత వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు. నిధులు సరిగా ఇవ్వకుండా కాలేజీల నిర్మాణం జరగకపోవడానికి గత ప్రభుత్వం కారణమని ఆరోపించారు. సిద్ధార్ధ మెడికల్ కాలేజీలో విద్యార్ధినులకు హాస్టల్ లేదన్నారు. P4 మోడల్‌లో మెడికల్ కాలేజీలు వచ్చిన దానికి తగిన ఫ్రీ సీట్లు ఉంటాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
Latest News