by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:33 PM
రాబోయే ఐదేళ్ల కాలంలో ఏపీ మొత్తం క్లీన్ ఎనర్జీనే ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఐటీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రీసెర్చ్ కాంక్లేవ్ -2025లో ముఖ్య అతిథిగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మీడియాతో మాట్లాడుతూ... ప్రతీ ఇంట్లో ఒక వ్యక్తి ఉద్యోగస్తుడై ఉండాలని నాడు చంద్రబాబు నాయుడు సంకల్పించారని అన్నారు.సీఎం చంద్రబాబు అభివృద్ధి చేసిన ఐటీ రంగంతో తెలుగు వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. గ్రీన్ ఎనర్జీతో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు, ఉద్యోగాలతో పాటు పొల్యూషన్ ఫ్రీ స్టేట్‌గా ఏపీ మారుతుందని తెలిపారు. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా మారి ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
Latest News