by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:33 PM
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. బిల్ గేట్స్ రచించిన పుస్తకాన్ని తనకు బహుమతిగా పంపించడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 'సోర్స్ కోడ్ - ఏ మెమరీ అబౌట్ ది ఎక్స్‌పీరియన్సెస్ అండ్ లెసన్స్ దట్ షేప్డ్ హిస్ ఇన్‌క్రిడబుల్ జర్నీ' అనే పుస్తకాన్ని బిల్ గేట్స్ రచించారు.తన జీవితం తొలినాళ్లలో కళాశాల వదిలిపెట్టి మైక్రోసాఫ్ట్ ప్రారంభించాలనే ఆలోచన, ఆ తర్వాత పరిణామాలపై ప్రేరణ పూరిత కథనాన్ని గేట్స్ రాశారు. అయితే విడుదలకు ముందే పుస్తకాన్ని సీఎం చంద్రబాబుకు బిల్ గేట్స్ బహుకరించారు. దీంతో ఈ పుస్తకాన్ని రచించిన బిల్ గేట్స్‌కు ఎక్స్ వేదికగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తనకు బుక్‌ను బహూకరించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కాగా, సీఎం చంద్రబాబు, బిల్ గేట్స్‌కు 1995 నుంచే మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సైతం వీరిద్దరూ కలిశారు.
Latest News