by Suryaa Desk | Sat, Jan 25, 2025, 08:21 PM
మధురపూడి రాజమహేంద్రవరంవిమానాశ్రయంలో జరుగుతున్న టెర్మినల్ భవన నిర్మాణ పనుల్లో ఇనుప కడ్డీలు ఊడిపడిన నేపథ్యంలో ఎంపీ పురందేశ్వరి ఘటనా స్థలిని పరిశీలించారు. ఘటనపై అధికారులతో సమీక్షించారు. కూలిన సమయంలో అదృష్టవశాత్తూ కార్మికులు లేకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. నిర్మాణ పనులు చేస్తున్న చెన్నై రెనాటస్ ప్రాజెక్ట్ట్స్ ఎండీ మనో పూసప్పన్, వైఎస్ ప్రెసిడెంట్ కరు బాకరన్, ప్రాజెక్టు డీజీఎం శరవణన్‌లను.. ఘటనపై ఎంపీ నిలదీశారు.ఈ విషయంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుతో మాట్లాడినట్టు చెప్పారు. ఇప్పటికే విమానయాన శాఖ అధికారులు, ఐఐటీ నిపుణుల బృందం విచారణ చేస్తోందని తెలిపారు. నివేదిక అందిన తర్వాత నిర్మాణంలో లోపాలు ఉన్నట్టు తేలితే బాధ్యులపై చర్యలు ఉంటాయని పురందేశ్వరి స్పష్టం చేశారు.
Latest News