by Suryaa Desk | Sat, Jan 25, 2025, 08:13 PM
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎన్నికల అధికారిగా అవార్డు లభించింది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పనల, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ అవార్డును అందుకున్నారు.
Latest News