by Suryaa Desk | Sat, Jan 25, 2025, 08:12 PM
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయసాయి నిర్ణయంపై కూటమి నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.విజయసాయిని వదిలిపెట్టబోమని హెచ్చరిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. విజయసాయిరెడ్డిని వదిలే ప్రసక్తే లేదని టీడీపీ నాయకులు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.వైసీపీపై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి బయటకు రావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని అన్నారు. శనివారం నాడు ఏలూరులో పట్టాభిరామ్ పర్యటించారు. పలు అబివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో పట్టాభిరామ్ మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతీ క్రైమ్‌లో విజయ సాయి రెడ్డికి వాటా ఉందని సంచలన ఆరోపణలు చేశారు. విజయ సాయి రెడ్డికి వ్యవసాయం చేసుకోవాలనే కోరిక జైల్లో తప్పక నెరవేరుస్తామని పట్టాభిరామ్ హామీ ఇచ్చారు. జైల్లో కూడా ఖైదీలకు వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. విజయసాయిరెడ్డి కూడా జైలుకు పోతారని.. ఆయన శేష జీవితంలో జైల్లో వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పిస్తామని పట్టాభిరామ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ పార్టీలో కేవలం జగన్ మోహన్ రెడ్డి, భారతీ మాత్రమే మిగులుతారని విమర్శలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి కూడా త్వరలోనే జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని పట్టాభిరామ్ హెచ్చరించారు. కేసుల నుంచి తప్పించుకోడానికి మాత్రమే విజయసాయిరెడ్డి రాజీనామా డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. తాము ఎవరిని వదిలిపెట్టబోమని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Latest News