by Suryaa Desk | Sat, Jan 25, 2025, 08:09 PM
కేంద్ర ప్రభుత్వం(Central Govt) 2025 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పద్మ అవార్డు(Padma Award)లను ప్రకటిచింది. దేశంలో పౌరులకు వారు వివిధ విభాగాల్లో అందించిన సేవలకు గాను ఈ పద్మ అవార్డులను అందిస్తారు.కాగా ఈ అత్యున్నత పౌర పురస్కార(Highest civilian award) అవార్డులను మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మవిభూషణ్(Padmavibhushan), పద్మభూషణ్(Padma Bhushan), పద్మశ్రీ(Padma Shri) అవార్డులుగా అందిస్తారు. ముఖ్యంగా సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, కళ, సైన్స్, వాణిజ్యం, పరిశ్రమలు, ఇంజినీరింగ్, క్రీడలు, వైద్యం, సాహిత్యం, విద్య, పౌర సేవ వంటి విభిన్న రంగాల్లో అందించిన అత్యుత్తమ ప్రతిభకు గాను ఈ మూడు అవార్డులను దేశ పౌరులకు అందిస్తారు. ఇందులో భాగంగా రోజు కేంద్రం పద్మ అవార్డుల జాభితాను విడుదల చేసింది.
బతూల్ బేగమ్(రాజస్థాన్)జానపదంలో పద్మ శ్రీ
వేలు అసాన్ (తమిళనాడు) సంగీతంలో పద్మ శ్రీ
భీమవ్వకు(కర్ణాటక) తోలుబొమ్మలాటలో పద్మ శ్రీ
మారుతీ భుజంగరావు(మహారాష్ట్ర)విద్య సాహిత్యంలో పద్మ శ్రీ
సల్లీ హోల్కర్(మధ్యప్రదేశ్) టెక్స్ టైల్స్‌లో పద్మ శ్రీ
గోకుల్ చంద్రదాస్(బెంగల్) సంగీతంలో పద్మ శ్రీ
లిబియా లోబో సర్దేశాయ్(గోవా) పద్మ శ్రీ
గుజరాత్ కు చెందిన పర్మార్ బేగం(టెక్స్ టైల్స్) పద్మ శ్రీ
కర్ణాటకకు చెందిన విజయలక్ష్మీకి వైద్య రంగంలో పద్మ శ్రీ
మహారాష్ట్రకి చెందిన చైత్రం దేవ్ చంద్ పవార్ కు (పర్యావరణం) పద్మ శ్రీ
ఛత్తీస్ గఢ్ కు చెందిన పండి రామ్ మాండవికి (కళలు) పద్మ శ్రీ అవార్డులను అందుకోనున్నారు.
అలాగే నటి వైజయంతి మాల, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులకు పద్మవిభూషణ్, మిథున్ చక్రవర్తి, ఉషా ఉతుప్‌లకు పద్మభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది.
Latest News