by Suryaa Desk | Sun, Jan 26, 2025, 12:53 PM
పొరపాటున కూడా నేను పార్టీ మారను.. వైయస్ఆర్‌సీపీలోనే ఉంటానని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ఆయన స్పందించారు. విజయసాయి రెడ్డి రాజీనామా దురదృష్టకరం అన్నారు. విజయసాయి రెడ్డి పార్టీకి, పార్లమెంట్ లోనూ వెన్నెముక లాంటివారని అభివర్ణించారు. ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది తెలియదు. కానీ, మా పార్టీ సభ్యుడిని ఇప్పుడు మళ్లీ రాజ్యసభకు ఎంపిక చేసుకోలేని పరిస్థితి లేదన్నారు. విజయ సాయిరెడ్డి అందరికీ మార్గదర్శకంగా ఉన్నారు. రేయింబవళ్లు పని చేశారు. ఆయన లేని లోటు తీవ్రమైనది అన్నారు. అయితే, అధికారం పోయాక పార్టీ నుంచి వెళ్లటం, రావడం కామన్.. కానీ, ఆ జాబితాలో విజయసాయిరెడ్డిని చూడలేం అన్నారు. ఏదేమైనా పొరపాటున కూడా నేను పార్టీ మారను.. వైయస్ఆర్‌సీపీలోనే ఉంటాను అని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు.
Latest News