by Suryaa Desk | Sun, Jan 26, 2025, 12:56 PM
విజయసాయిరెడ్డి రాజీనామాపై వైయస్ఆర్‌సీపీ స్పందించింది. ‘‘మేము మీ నిర్ణయాన్ని ఆమోదించనప్పటికీ, మీ నిర్ణయాన్ని గౌరవిస్తాము. మా పార్టీ ఆవిర్భావం నుంచి మీరు మా పార్టీకి బలమైన మూలస్తంభాలలో ఒకరిగా ఉన్నారు. కష్టాలు, విజయాలు రెండింటిలోనూ మీరు మాతో నిలబడే ఉన్నారు. ఇప్పుడు పార్టీ నుండి వైదొలగాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము’’ అని వైయస్ఆర్‌సీపీ పేర్కొంది.‘‘హార్టికల్చర్‌లో మీ అభిరుచిని కొనసాగించడానికి.. రాజకీయాల నుండి వైదొలగాలనే మీ నిర్షయానికి మేము గౌరవిస్తున్నాము. పార్టీకి మీరు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భవిష్యత్తులో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము’’ అని వైయస్ఆర్‌సీపీ ట్వీట్ చేసింది.
Latest News