by Suryaa Desk | Sun, Jan 26, 2025, 07:17 PM
జగన్‌కు అత్యంత సన్నిహితుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ పరిణామంపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి దీనిపై స్పందించారు. ‘‘వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు వైజాగ్ బాధ్యతలు అప్పగించారని దీనిపై కొన్ని నెగెటివ్ పార్ట్స్ కూడా మెంట్లు ఉన్నాయి.. కాకినాడ సెజ్‌కు సంబంధించి తన అల్లుడి కేసులు ఉన్నాయని అంటున్నారు.. ప్రస్తుతం ఈడీ, సీబీఐ వ్యవస్థలే ఏ ప్రభుత్వాన్నైనా బెండ్ చేస్తున్నాయి.. దీనికి విజయసాయి రెడ్డి అతీతుడు కాదు అని నేను అనుకుంటున్నాను.. ఆయన లేదని చెబుతున్నా దీనికోసమే ఉన్నాడని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం’’ అని తెలిపారు. దీనికి ముందు ‘రాజకీయాల్లో ఏదీ అనుకోకుండా జరగదు.. ఒకవేళ జరిగితే, అది ఆ విధంగా ప్రణాళిక ప్రకారం జరిగిందని మీరు పందేం కూడా వేయవచ్చు’ అని ఫ్రాంక్లిన్ డీ. రూజ్ వెల్ట్ కొటేషన్ ను పోస్ట్ చేశారు.