by Suryaa Desk | Sun, Jan 26, 2025, 07:34 PM
రోజా మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. ఆమె వెళ్లి జబర్దస్త్ షోలు, అమ్మపాత్రలు చేసుకుంటే బెటర్ అని మాజీ మంత్రిపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సైటైర్లు వేశారు. తమ నాయకుడు చంద్రబాబు గత 7 నెలల పాలనలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తుంటే.. గత ఐదేళ్ల వైఎస్ఆర్‌సీపీ పాలనలో జగన్.. విదేశాల నుంచి కోడి గుడ్లు, ఇస్తరాకుల కంపెనీలను తీసుకొచ్చారని సుధీర్ రెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు చదువురాని, చేతకాని దద్దమ్మలని ఆయన విమర్శించారు. రోజాది పిచ్చి మాటలని, ఆమె మాటలను తాము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. మేకప్, ప్యాకప్ అయిన రోజాకి, టీవీల్లో జబర్దస్త్, సినిమాల్లో తల్లి పాత్రలే దిక్కని వ్యంగంగా అన్నారు.
Latest News