by Suryaa Desk | Sun, Jan 26, 2025, 07:39 PM
రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాలో 600 ఎకరాల్లో డొమెస్టిక్ టెర్మినల్ నిర్మాణానికి స్థలాన్ని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు పరిశీలించారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు ఉండగా.. వాటిని 14కు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలిపిందని సమాచారం.
Latest News