by Suryaa Desk | Sun, Jan 26, 2025, 07:54 PM
AP: సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం మల్లాకాలవ గ్రామానికి చెందిన రైతు సాకే గంగాధర విద్యుదాఘాతంతో మరణించాడు. రోజూ మాదిరిగానే ఇవాళ సాయంత్రం పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లాడు. విద్యుత్ షాక్ తగిలి విగతజీవిగా పడి ఉన్నాడు. అతడ్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Latest News