by Suryaa Desk | Sun, Jan 26, 2025, 07:54 PM
కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జిల్లా జైల్లో నిందితుడిని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గుర్తించనున్నారు. దీని కోసం జిల్లా న్యాయమూర్తి సమక్షంలో పోలీసులు ఆదివారం పరేడ్ నిర్వహించనున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని రిమాండ్‌లో ఉన్న తులసి బాబు కోర్టును ఆశ్రయించారు. దీంతో తులసిబాబు పోలికలతో ఉన్న వ్యక్తులతో రఘురామకు పరేడ్ నిర్వహించనున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే మాజీ సీఐడీ ఏఎస్సీ విజయ్‌పాల్ అరస్టయి గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Latest News