by Suryaa Desk | Sun, Jan 26, 2025, 07:57 PM
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తన ఆత్మకథ ‘సోర్స్ కోడ్-మై బిగినింగ్స్’ పుస్తకాన్ని సీఎం చంద్రబాబుకు బహూకరించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు శనివారం ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ.. ‘పుస్తకాన్ని బహూకరించిన నా స్నేహితుడికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఈ పుస్తకం త్వరలో మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఆయన అద్భుతమైన జీవితాన్ని తీర్చిదిద్దిన అనుభవాలు, పాఠాల గురించిన జ్ఞాపకాలను ఈ పుస్తకం చెబుతుందని పేర్కొన్నారు. ఆయన చిన్ననాటి విషయాల నుంచి కళాశాలను విడిచిపెట్టి, మైక్రోసాఫ్ట్ సంస్థను ప్రారంభించాలనే నిర్ణయం తదితర విషయాలపై ఆయన రాసిన ఈ పుస్తకం స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పేర్కొంటూ బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.
Latest News