రాజీనామా పేరుతో విజయసాయిరెడ్డి డ్రామాలాడుతున్నారు
 

by Suryaa Desk | Sun, Jan 26, 2025, 07:59 PM

విజయసాయిరెడ్డి, ఆయన వియ్యంకుడి కుటుంబం చేసిన పాపాలను దేవుడు కూడా క్షమించడని, శిక్ష అనుభవించి తీరాల్సిందేనని ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ‘రాజీనామా పేరుతో విజయసాయిరెడ్డి వేస్తున్న ఎత్తులు, పైఎత్తులు, నక్కజిత్తులు చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్‌, వైసీపీలకు వ్యతిరేకంగా పోరాడే నాపై కక్షగట్టి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలిసి కుట్రలు చేసిన దుర్మార్గుడు విజయసాయిరెడ్డి. నా కుమారుడికి, మా కుటుంబానికీ సూట్‌కేస్‌ కంపెనీలు, అక్రమాస్తులు ఉన్నాయని, మనీలాండరింగ్‌ చేశామని ఢిల్లీలో ఈడీ, ఐటీ, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీ్‌సకు ఫిర్యాదు చేశారు. మాది అల్లీపురం. మాకు కొంచెం దూరంలోనే విజయసాయి ఊరు తాళ్లపూడి ఉంది. తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తులను రాజకీయాల కోసం అమ్ముకున్న కుటుంబం మాది. విజయసాయి తండ్రి, పినతండ్రి కలిసి వాళ్ల చిన్నాయనను హత్యచేసి జైలుకెళ్లిన చరిత్ర ఆ కుటుంబానిది. మా పెద నాయన ఆదినారాయణరెడ్డి స్వాతంత్య్ర పోరాటంలో జైలుకెళితే, విజయసాయిరెడ్డి తండ్రి, పినతండ్రులు మర్డర్‌ కేసులో ఊచలు లెక్కపెట్టారు. పురందేశ్వరిపై దుర్మార్గమైన భాషను ప్రయోగించారు. ఆ దుర్మార్గాన్ని నేనూ ఎదుర్కొన్నాను. అందుకు రూ.5 కోట్లకు నాపై విజయసాయిరెడ్డి పరువునష్టం దావా నోటీసు పంపారు. దాన్ని చెత్తబుట్టలో పడేశాను. తాళ్లపూడికి చెందిన సాయిరెడ్డి ఉత్తరాంధ్రతో ఏం సంబంధం? నెల్లూరుకే చెందిన ఆయన వియ్యంకుడు కూడా ఉత్తరాంధ్రలో పెత్తనం చేసి రూ.వేల కోట్లు దోచుకున్నారు. ఏ కారణం లేకుండా చంద్రబాబును జైలుకు పంపారు. 2029 ఎన్నికల నాటికి చంచద్రబాబు ప్రాణాలతో ఉండకూడదని కోరుకున్న దుర్మార్గపు వ్యక్తి విజయసాయిరెడ్డి.’ అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

Latest News
Vishwabandhu Bharat: India dispatches humanitarian aid to Kurdistan region of Iraq Mon, Jan 27, 2025, 04:46 PM
How can Padma award be given to Gaddar, asks MoS Bandi Sanjay Mon, Jan 27, 2025, 04:44 PM
Assam govt taking multiple initiatives to uplift education sector: CM Sarma Mon, Jan 27, 2025, 04:43 PM
To be recognised is truly special, says Bumrah on winning ICC Men’s Test Cricketer of the Year Mon, Jan 27, 2025, 04:29 PM
Sensex, Nifty slide over 1 pc amid weak global cues, US trade uncertainties Mon, Jan 27, 2025, 04:12 PM