by Suryaa Desk | Sun, Jan 26, 2025, 08:00 PM
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో జరిగింది. జిల్లాలో ఉన్న ఓటర్లలో నాలుగో వంతుమంది తెలుగుదేశం సభ్యులుగా చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పాలకొల్లు ప్రథమ స్థానంలో నిలచింది. రాష్ట్ర స్థాయి రికార్డులను బ్రేక్ చేసేలా సభ్యత్వాలు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఉండి నియోకవర్గం నిలిచింది. ఓటర్లలో దాదాపు మూడో వంతు మంది వంతుమంది తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. నమోదు కార్యక్రమాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో మాదిరిగా కేవలం రశీదులు ఇచ్చే సంప్రదాయానికి స్వస్తి చెప్పింది. సభ్యత్వం తీసుకున్న వారు ఆన్‌లైన్‌లో నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంది. దాంతో ఇష్టం ఉన్న వారే తెలుగుదేశం సభ్యత్వం తీసుకునే విధంగా పార్టీ ఆదేశాలు జారీచేసింది. నియోజకవర్గ బాధ్యులు అధిష్ఠానం ఆదేశాలకు కట్టుబడి పనిచేశారు. ప్రణాళికాబద్ధంగా సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది సభ్యత్వాన్ని తీసుకుంటే ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే దాదాపు 4.90 లక్షల మంది తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వంలో చేరారు. తెలుగుదేశం పార్టీ బీమా సౌకర్యం కూడా కల్పించింది. అన్ని వర్గాలనుంచి స్పందన లభించింది. కేడర్ కూడా పట్టుదలతో సభ్యత్వనమోదుకు కృషి చేసింది. ప్రభుత్వం ఏర్పడినా సరే సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయిందంటూ జిల్లాలోని కొన్ని నియోకవర్గాల్లో తెలుగుదేశం శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. ముఖ్యంగా తాడేపల్లిగూడెం, భీమవరం, నర్సాపురంలో ఈ సారి నాయకత్వంలోనూ, కేడర్‌లోనూ కాస్త అసంతృప్తి ఉంది. మూడు నియోకవర్గాల్లో కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించారు. అయితే నామినేటె డ్ పదవుల విషయంలోనూ ప్రధాన్యం లభించలేదు. అయినా సరే సభ్యత్వ నమోదులో నియోజకవర్గ బాధ్యులు తమ వంతు కృషి చేశారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టారు. ఎప్పటికప్పుడు అధిష్ఠానం కూడా నియోజకవర్గాల వారీగా అప్రమత్తం చేసింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని దిశానిర్దేశం చేసింది.
Latest News