by Suryaa Desk | Sun, Jan 26, 2025, 08:00 PM
కొల్లేరు ప్రజల జీవనోపాధిని కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ కామి నేని శ్రీనివాస్ అన్నారు. కైకలూరులో శనివారం కొల్లే రు ప్రజల ఐక్యత బహిరంగ సభను నిర్వహించారు. సభలో కొల్లేరు ప్రజల సంక్షేమానికి ఐక్యతతోనే పోరాటం చేసి సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేయాలని తీర్మానం చేశారు. సభకు మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు, ఏలూరు, పశ్చిమ గోదా వరి జిల్లా నుంచి కొల్లేరు గ్రామాల ప్రజలు, సర్పం చ్‌లు, ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Latest News