by Suryaa Desk | Sun, Jan 26, 2025, 08:04 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తుం దని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే విరుపాక్షి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. హత్యకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ బండారి ఈరన్న కుటుంబ సభ్యలను శనివారం పరామర్శించారు. సీఎం చంద్రబాబు, కుమారుడు లోకేష్ దావోస్‌లో రెడ్‌బుక్ అమలు చేస్తామని చెప్పడం హత్య రాజకీయాలను ప్రోత్సహించడానికేనన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి వైసీపీ నాయకులను ఊచకోతకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. హత్యకు కారకులైన వారిని తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులను చేతగాని వారిగా చూస్తే, అధికార పార్టీ నాయకులపై ఎదురుదాడి చేస్తామని హెచ్చరించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవరించకుండా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కురువ శశికళ కృష్ణమోహన్, జడ్పీటీసీ కిట్టు, వైసీపీ నాయకులు జనార్దన్ నాయుడు, నాగప్ప, గోవర్దన్, వీరేశ్, ఓబులేసు, గిరి, కిషోర్, నాగేంద్ర, నాగరాజు పాల్గొన్నారు.
Latest News