by Suryaa Desk | Sun, Jan 26, 2025, 08:03 PM
వైద్య పరికరాలు నిరుపయోగమైతే ఎలా అని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు. శనివారం చెన్నూరు సీహెచసీలో నిర్వహించిన అభివృద్ధి సలహామండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్స్‌రే ప్లాంటు ఉన్నా చాలా కాలంగా పనిచేయడం లేదని, వీల్‌చైర్ లేదని, కంటి, చర్మవ్యాధుల వైద్యులు, ఫిజియోథెరపి లేదని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సమస్యలు విన్న ఎమ్మెల్యే ఎక్స్‌రే మిషన ఎందుకు చెడిపోయింది, ఎందుకు తయారు చేయలేదని టెక్నీషియనను ప్రశ్నించారు. అతను మదర్‌బోర్డు పోయిందని చెప్పడంతో వెంటనే సంబంధిత వ్యక్తికి ఫోను చేయడంతో ఆ వ్యక్తి రాజమండ్రి నుంచి తీసుకువస్తాం... టైం పడుతుందనడంతో ఎమ్మె ల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌రే మిషను రెండు, మూడు రోజుల్లో తీసుకువచ్చి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలన్నారు. అలాగే కంటి, చర్మ వ్యాధుల వైద్యులను వారంలో రెండు మూడురోజులైనా పీహెచసీకి వచ్చి వైద్య పరీక్షలు చేసేలా ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు. ఫిజియోథెరపి్‌స్టను కూ డా వచ్చేలా చూస్తామన్నారు. అలాగే మరో భవనంలో సీహెచసీ నడవడం ఏమిటి, ఫస్ట్‌ఫ్లోరు ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదని ఇంజనీర్లను ప్రశ్నించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన శివారెడ్డి మాట్లాడుతూ డీసీహెచఎ్‌స నిర్వాకం వల్లే ఈ భవనం పరిస్థితి ఇలా మారిందన్నారు. కాంట్రాక్టరు పనులు సరిగా చేయలేదని, బిల్లులు నిలిపి బ్లాక్‌లిస్టులో పెట్టాలన్నారు. వైద్యాధికారి సాగర్‌కుమారి మాట్లాడుతూ వైద్యశాలలో రెండు ఏఎనఎం పోస్టులు, ఒక జూనియర్ అసిస్టెంటు పోస్టు ఖాళీగా ఉందన్నారు. సరైన వైద్య భవనం లేనందువల్ల పెద్ద ఆపరేషన్లు చేయలేకపోతున్నామన్నారు.
Latest News