by Suryaa Desk | Sun, Jan 26, 2025, 08:12 PM
హత్యా రాజకీయాలను టీడీపీ ప్రోత్సహిందని, అవి తమ నైజం కాదని, అరికెర ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్య బాధాకరమని ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్, యువ నాయకుడు గిరి మల్లేష్ గౌడ్ అన్నారు. శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడు తూ, టీడీపీ బీసీల పార్టీ అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్నను హత్య చేసిన వారిని ఊపేక్షించవద్దని పోలీసులకు సూచించామన్నారు. ఎమ్మెల్యే విరుపాక్షి సీఎం చంద్రబాబు, తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజాసేవ చేయడానికే వచ్చామని, హత్యా రాజకీయాలు చేయడానికి రాలేదన్నారు. హత్యకు గురైన ఈరన్నకు టీడీపీ నాయకులు సంతాపం ప్రక టించారన్నారు. రాంనాథ్ యాదవ్, కిష్టప్ప, కన్వీనర్ అశోక్, రఘు, ప్రసాద్‌రెడ్డి, అట్టేకల్ జగన్ మోహన్, బాబు, తిమ్మయ్య, రవి యాదవ్, రంగన్న, సుభాన్, రాముడు, మల్లన్న, నరసప్ప, మసాల జగన్, నారాయణ, సురేంద్ర కొమ్ము రామాంజనేయులు, రాజు, రంగయ్య, గూళ్యం రామాంజ నేయులు, అరికెర ఆంజనేయ పాల్గొన్నారు.
Latest News