by Suryaa Desk | Sun, Jan 26, 2025, 08:13 PM
సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పదవి తరగతి చదువుతున్న విద్యార్థులకు శనివారం ప్రేరణ తరగతులు నిర్వహించారు. కడప సహాయ సక్షేమ అధికారి పరిధిలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి సాంఘిక, సక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.సరస్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చిలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఉత్తీర్ణత సాధించేందుకు మెళకువలతో కూడిన పలు అంశాలపై విద్యార్థులకు వివరించారు. ఏఎ్‌సడబ్ల్యూఓ లక్ష్మీనారాయణ, వసతి గృహల సంక్షేమ అధికారులు లీలావతి, వెంకటరమణ, శిరీష, పద్మ, వెంకట రమణయ్య, మరియమ్మ, ట్యూటర్లు పాల్గొన్నారు.
Latest News