|
|
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 08:23 PM
వైసీపీ నాయకులు రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ వింద్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ ఎన్‌ఏసీ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో విందుకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరై వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రత్యేక ప్రార్థనల్లో కూడా పాల్గొన్నారు.ప్రార్థనలు చేసిన అనంతరం ముస్లిం సోదరులతో కలిసి జగన్ విందు చేశారు. ముస్లిం మత పెద్దలతో పాటు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇప్తార్ విందుకు హాజరయ్యారు. పలువురు జగన్ కి పండ్లు తినిపించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్తార్ విందులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈనెల 27న విజయవాడలో రాష్ట్రస్థాయి ఇప్తార్ వేడుకను నిర్వహించనుంది.
Latest News