మొదటి ఇన్నింగ్స్ లో రాజస్థాన్ స్వల్ప స్కోర్.. కోల్‌కతా టార్గెట్ ఇదే...
 

by Suryaa Desk | Wed, Mar 26, 2025, 09:46 PM

2025 IPL లో భాగంగా రాజస్తాన్ రాయల్స్  vs  కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్  బౌలర్లు రాణించారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో చేతులెత్తేసిన కేకేఆర్ బౌలర్లు ఈ మ్యాచ్ లో మాత్రం అదరగొట్టారు. పిచ్ కూడా సహకరించడంతో రాజస్తాన్ రాయల్స్ పెద్ద స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (28 బంతుల్లో 33; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ (29), రియాన్ పరాగ్ (25) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, వైభవ్ అరోరా,, హర్షిత్ రాణాలకు తలా 2 వికెట్లు లభించాయి.


టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ రాయల్స్ కు శుభారంభం లభించలేదు. ఆరంభంలోనే సంజూ సామ్సన్ (13) వికెట్ ను కోల్పోయింది. అనంతరం జైస్వాల్, పరాగ్ లు కాసేపు క్రీజులో నిలబడ్డారు. అయితే స్పిన్నర్ల రాకతో వీరిద్దరు పెవిలియన్ కు చేరారు. ధ్రువ్ జురెల్ మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. పిచ్ స్లోగా ఉండటంతో బంతి బ్యాట్ మీదకు రాలేదు. ఈ పిచ్ పై 151 పరుగులు కూడా విన్నింగ్ టోటల్ అయ్యే అవకాశం ఉంది. ఆర్సీబీ మ్యాచ్ లో ఏ మాత్రం ప్రభావం చూపని వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో కేవలం17 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

Latest News
People were getting 'yippy,' says Trump on tariff pause Thu, Apr 10, 2025, 12:10 PM
Firing resumes between security forces and terrorists in J&K's Udhampur Thu, Apr 10, 2025, 12:05 PM
India and UK reaffirm free trade agreement, support supply chains Thu, Apr 10, 2025, 11:56 AM
US tariffs: South Korea to devise support measures for chip industry Thu, Apr 10, 2025, 11:52 AM
Tahawwur Rana's extradition to help India expose role of Pak agencies in 26/11 Thu, Apr 10, 2025, 11:48 AM