SRH vs LSG మ్యాచ్ లో సందడి చేయనున్న SS థమన్...
 

by Suryaa Desk | Wed, Mar 26, 2025, 10:35 PM

రేపు ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ స్టేడియంలో SRH vs LSG మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు భారీగా తరలిరానున్నారు ప్రేక్షకులు. వాళ్లను మరింత ఎంటర్‌టైన్ చేసేందుకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఐపీఎల్‌కు హోస్ట్‌గా ఉన్న స్టేడియాల్లో మ్యాచ్‌లకి ముందు ఇదే తరహా సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్‌తో బీసీసీఐ ఈవెంట్స్ నిర్వహిస్తోంది.  ఈ స్టార్ కంపోజర్ గ్రౌండ్‌కి వస్తే దుమ్మురేపడం ఖాయం. హిట్ సాంగ్స్‌తో ఆడియెన్స్‌కి కిక్ ఇవ్వడం పక్కా. ఓ వైపు ఆటగాళ్ల విన్యాసాలు.. అంతకుముందే తమన్ మ్యూజిక్‌.. ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ అనే చెప్పొచ్చు. మ్యాచ్‌ నడుస్తుండగా అభిమానులు ఎలాగూ ఎంజాయ్ చేస్తారు. కానీ అంతకుముందే మ్యూజిక్‌తో మొదలెడితే.. ఆ హుషారు మ్యాచ్ మొత్తం కంటిన్యూ అవుతుందన్నది బీసీసీఐ లెక్క. అంతేకాదూ ఈవెంట్లతో టికెట్ల సంఖ్య పెరిగితే స్టేడియంలో ఆ క్రౌడే వేరు. అరుపులు, కేకలతో స్టేడియం మార్మోగిపోతుంటే మ్యాచ్‌కి అంతకుమించి ఊపు వస్తుందని లెక్కలేసుకుంటోంది. 





Latest News
US forces seize 2nd oil tanker off coast of Venezuela Sun, Dec 21, 2025, 02:52 PM
Pakistan: Police vehicle targeted near Afghan refugee camp targeted in Khyber Pakhtunkhwa Sun, Dec 21, 2025, 02:44 PM
Would have got Jaiswal and Jitesh in place of Ishan and Washington, says Jaffer Sun, Dec 21, 2025, 02:36 PM
Sydney terror attack: Australia marks Day of Reflection for victims, orders intelligence review Sun, Dec 21, 2025, 01:43 PM
PM Modi interacts with Assam students aboard Brahmaputra cruise Sun, Dec 21, 2025, 01:37 PM