![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 06:52 PM
అనంతపురంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర రావు క్లినిక్ పై చర్యలు తీసుకోవాలని దళిత గిరిజన ప్రజా సంఘం అధ్యక్షుడు రాకెట్ల చందు నాయక్ గురువారం డిమాండ్ చేశారు.
నగరంలోని గిల్డ్ అఫ్ సర్వీస్ స్కూల్ కు ఎదురుగా వెంకటేశ్వర రావు పేరుతో నడుపుతున్న క్లినిక్ కు 6 ఏళ్లుగా ఎటువంటి లైసెన్సులు లేవని ఆరోపించారు. రూల్స్ కు విరుద్ధంగా నడుపుతున్న క్లినిక్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.