గేట్స్ ఫౌండేషన్ కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
 

by Suryaa Desk | Fri, Mar 28, 2025, 05:43 AM

ఏపీ ప్రభుత్వం ఇటీవల ఢిల్లీలో  బిల్ గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం కుదిరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం అమలుకు ఏపీ ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ లో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. సుపరిపాలన, వ్యవసాయంలో ఏఐ టెక్నాలజీ వినియోగం, వైద్య ఆరోగ్య రంగం, జీవన ప్రమాణాల పెంపుపై ఏపీ ప్రభుత్వం-గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమై అనేక అంశాలపై లోతుగా చర్చించారు.

Latest News
Bangladesh suicide rates surge in 2020-24, 40 people died daily Tue, Dec 23, 2025, 04:09 PM
EAM Jaishankar meets Lankan ministers, reiterates India's full support Tue, Dec 23, 2025, 04:04 PM
Resolving Delhi's inherited problems on all fronts: CM Rekha Gupta Tue, Dec 23, 2025, 03:55 PM
Free trade pact with New Zealand India's first women-led FTA: PM Modi Tue, Dec 23, 2025, 03:52 PM
CM Stalin writes to EAM after Sri Lankan Navy arrests 12 TN fishermen Tue, Dec 23, 2025, 03:47 PM