దేశంలో పర్యటించనున్న పుతిన్
 

by Suryaa Desk | Fri, Mar 28, 2025, 05:50 AM

భారత్ పర్యటనకు రావాలంటూ ప్రధాని మోదీ చేసిన ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటనకు రావడానికి అంగీకరించారని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. పుతిన్ భారత్ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. 'రష్యా అండ్ ఇండియా: టువార్డ్ ఏ బైలేటరల్ అజెండా' పేరుతో రష్యన్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ నిర్వహించిన కాన్ఫరెన్స్ లో లావ్రోవ్ మాట్లాడుతూ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత మోదీ తొలి అంతర్జాతీయ పర్యటన రష్యాలో చేశారని చెప్పారు.గత ఏడాది జులైలో మోదీ రష్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్ లో పర్యటించాలని పుతిన్ ను మోదీ ఆహ్వానించారు. అమెరికా టారిఫ్ ల ముప్పు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు సంప్రదింపులు జరుగుతున్న తరుణంలో పుతిన్ భారత్ లో పర్యటించనుండటం గమనార్హం.

Latest News
Bangladesh suicide rates surge in 2020-24, 40 people died daily Tue, Dec 23, 2025, 04:09 PM
EAM Jaishankar meets Lankan ministers, reiterates India's full support Tue, Dec 23, 2025, 04:04 PM
Resolving Delhi's inherited problems on all fronts: CM Rekha Gupta Tue, Dec 23, 2025, 03:55 PM
Free trade pact with New Zealand India's first women-led FTA: PM Modi Tue, Dec 23, 2025, 03:52 PM
CM Stalin writes to EAM after Sri Lankan Navy arrests 12 TN fishermen Tue, Dec 23, 2025, 03:47 PM