![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 06:02 AM
కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవిని వైసీపీ కైవసం చేసుకుంది. జిల్లాపరిషత్ ఛైర్మన్ గా వైసీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో పోటీకి టీడీపీ దూరంగా ఉంది. ఛైర్మన్ పదవికి కేవలం వైసీపీ నుంచి మాత్రమే నామినేషన్ రావడంతో రామగోవిందరెడ్డి గెలుపొందినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. జడ్పీ ఛైర్మన్ గా ఎన్నికైన రామగోవిందరెడ్డి బ్రహ్మంగారిమఠం మండలం జడ్పీటీసీగా రెండు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన వైసీపీ అధినేత జగన్... రామగోవిందరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
Latest News