![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 07:39 AM
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి పెసరవెల్లి రమాదేవి గెలుపొందారు. ఎంపీపీ ఎన్నికకు టీడీపీ సభ్యుల గైర్హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి నాగమ్మ విజయం సాధించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి బండి లక్ష్మీదేవి గెలుపొందారు. అనంతపురం జిల్లా కంబదూర్ ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి కురుబ లక్ష్మీదేవి ఏకగ్రీవమయ్యారు. కర్నూలు జిల్లా తుగ్గలి ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి రాచపాటి రామాంజినమ్మ గెలుపొందారు. రామాంజినమ్మకు మద్దతుగా 16 మంది ఎంపీటీసీలు నిలిచారు. తిరుపతి రూరల్ ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి మూలం చంద్రమోహన్ విజయం సాధించారు. చంద్రమోహన్ కు 33 మంది ఎంపీటీసీలు మద్దతు పలికారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి ఆల్ల సుబ్బమ్మ గెలుపొందారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి పట్నం ప్రతాప్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖాజీపేట వైస్ ఎంపీపీ స్థానాన్ని వైయస్సార్ సీపీ అభ్యర్థి ముమ్మడి స్వప్న గెలిపొందారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజవర్గం మాకవరపాలెం మండల పరిషత్ అధ్యక్షుడిగా రుత్తల సర్వేశ్వరరావు ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమ శంకర్ గణేష్ ఆధ్వర్యంలో 10 మంది వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీలు మండల కార్యాలయం చేరుకున్నారు. బలం లేక టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గడంతో సర్వేశ్వరరావు ఎన్నిక ఏకగ్రీవమైంది. కర్నూలు వెల్దుర్తి ఎంపీపీ పదవి వైయస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. ఏకగ్రీవంగా దేశాయి లక్ష్మీదేవి ఎంపీపీగా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా పీవీపాలెం ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ సీతారామరాజు ఎన్నికయ్యారు.
Latest News