![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:11 PM
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్‌ను సీఐడీ కోర్టు ఏప్రిల్ 9 వరకు పొడిగించింది. దాంతో ఆయనను పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ, ఎస్టీ కోర్టు వల్లభనేని వంశీ రిమాండ్‌ను వచ్చే నెల 8 వరకు పొడిగించింది.ఈ కేసులో వంశీకి ఏప్రిల్ 9 వరకు సీఐడీ కోర్టు రిమాండ్ పొడిగిస్తూ తీర్పునిచ్చింది. సీఐడీ కోర్టు రిమాండ్‌ను పొడిగించడంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించారు. మరోవైపు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి. వంశీ బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సాయంత్రానికి తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ కోర్టులో కూడా వంశీకి బెయిల్ మంజూరు అవుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. నేటి సాయంత్రం 4 గంటల తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
Latest News