![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:45 PM
విశాఖ జిల్లా, యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో హై డ్రామా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. టీడీపీ కూటమి ఎంపీటీసీలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ వైసీపీ ఎంపీటీసీలు ఆరోపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి.. ఎన్నికల ప్రక్రియ రసాభాసగా మారింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రొసీడింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ అస్వస్థతకు గురయి.. స్పృహ కోల్పోయి పడిపోయారు. దీంతో అధికారులు మెడికల్ సిబ్బందిని లోపలికి పంపించారు. ప్రశాంత వాతావరణం నెలకొనే వరకు ఎన్నిక వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు.
Latest News