![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:53 PM
ప్రకాశం జిల్లాలో మండల పరిషత్ ఎన్నికలు దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. పుల్లల చెరువు మండల పరిషత్‌లో వైస్ ఎంపీపీ ఎన్నిక జరిగింది. అయితే మటుకుల గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో కాంట్రాక్టు పద్ధతిలో పొలయ్య వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఆయన భార్య నాగేంద్రమ్మ వైసీపీ ఎంపీటీసీగా ఉన్నారు. అయితే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయమని పొలయ్య తన భార్యకు చెప్పాడట. కానీ నాగేంద్రమ్మ వైసీపీకి ఓటు వేశారు. దాంతో భయంతో నాగేంద్రమ్మ పుట్టింటికి వెళ్లిపోయారు.