|
|
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 04:02 PM
దేశంలోని పలు రెస్టారెంట్లు తమ కస్టమర్ల నుంచి GSTతో పాటు.. సర్వీస్ ఛార్జీని కూడా వసూలు చేస్తున్నాయి. ఇలా చార్జీలు విధించడంపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. 2022లో వినియోగదారుల సంఘం జారీచేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ.. కస్టమర్ల నుంచి సర్వీసు ఛార్జీల రూపంలో డబ్బులు వసూలు చేయటం తప్పనిసరి కాదని తెలిపింది. ఫుడ్ బిల్లులపై సర్వీసు ఛార్జీ విధించడం అన్యాయమైన వాణిజ్య పద్ధతులతో సమానమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Latest News