![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 05:52 PM
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు కూడా దాదాపుగా ముగింపు దశకు వచ్చేశాయి. మార్చి 31వ తేదీతో ఏపీలో పదో తరగతి పరీక్షలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంటోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటుగా స్కూలు సిబ్బందితో పాఠశాలల వద్ద వాతావరణం కోలాహలంగా ఉంటోంది. ఇక పరీక్షల కోసం ఏపీ ప్రభుత్వం కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ వస్తోంది, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, విజిటింగ్ స్క్వాడ్లతో మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా పరీక్షల నిర్వహణ జరుగుతోంది. అయితే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఊహించని ఘటన జరిగింది. చిలకలూరిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పదో తరగతి పరీక్షలకు చీఫ్ సూపరిటెండెంట్‌గా వెళ్లిన ఓ అధికారిని పాము కాటువేసింది. చిలకలూరిపేటలోని వేద స్కూల్లో ఈ ఘటన జరిగింది. కరీముల్లా అనే వ్యక్తి వేద స్కూలుకు చీఫ్ సూపరిటెండెంట్‌గా విజిటింగ్‌కు వచ్చారు. అయితే ఆయనను పరీక్షా హాలులోనే పాముకాటు వేసింది. బెంచీలపై వేసిన విద్యార్థుల హాల్ టికెట్ నంబర్లను తనిఖీ చేస్తున్న సమయంలో ఆయనను దీంతో స్కూలు సిబ్బంది వెంటనే కరీముల్లాకు చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు కరీముల్లా కోమటినేని వారి పాలెం ప్రభుత్వ పాఠశాలలో హెడ్మాస్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే పరీక్షా హాలులోకి పాములు వస్తున్నా కూడా స్కూలు యాజమాన్యం పట్టించుకోరా అనే విమర్శలు వస్తున్నాయి. పరీక్షా హాలులోకే పాములు వస్తే విద్యార్థులకు రక్షణ ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు పదో తరగతి పరీక్షల ప్రారంభంలోనూ స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన సంగతి తెలిసిందే. అమలాపురం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. పరీక్షలు రాసేందుకు వచ్చేటప్పటికి ఓ పరీక్ష గదిలో సిమెంటు బస్తాలు ఉండటం విమర్శలకు తావిచ్చింది. విద్యార్థులు పరీక్ష కోసం వచ్చినప్పటికీ గదిలోని సిమెంట్ బస్తాలను ఖాళీ చేయించకపోవటంతో. విద్యార్థులు గది బయటే వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత స్కూలు సిబ్బంది తీరిగ్గా వాటిని అక్కడి నుంచి తీసివేశారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.
Latest News