లాభాల స్వీకరణతో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
 

by Suryaa Desk | Tue, Dec 09, 2025, 07:17 PM

భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు పతనమయ్యాయి. దీనికితోడు, భారత బియ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలు విధించవచ్చనే వార్తలు సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయి.ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 436.41 పాయింట్లు నష్టపోయి 84,666.28 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 120.90 పాయింట్లు క్షీణించి 25,839.65 వద్ద ముగిసింది. ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి హెవీవెయిట్ షేర్లు 4.6 శాతం వరకు నష్టపోయాయి. అయితే, ఎటర్నల్, టైటాన్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఎస్బీఐ వంటి షేర్లు లాభాల్లో ముగిసి సూచీలకు కొంత మద్దతు ఇచ్చాయి.ప్రధాన సూచీలు నష్టపోయినప్పటికీ, బ్రాడర్ మార్కెట్లు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 0.32 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 1.14 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ, ఆటో, ఫార్మా సహా చాలా రంగాల సూచీలు దాదాపు 1 శాతం మేర నష్టపోయాయి.అంతర్జాతీయ వాణిజ్య ఆందోళనలు, లాభాల స్వీకరణ మార్కెట్లపై ఒత్తిడి పెంచుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, కరెన్సీ కదలికలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, డాలర్‌తో పోలిస్తే రూపాయి 23 పైసలు బలపడి 89.82 వద్ద ముగిసింది.

Latest News
S. Korea's food exports hit record high in 2025 Mon, Jan 12, 2026, 11:27 AM
Sensex, Nifty open lower amid rising geopolitical tensions Mon, Jan 12, 2026, 11:21 AM
'He walks the talk...,' Shreyas lauds Kohli's years of consistency Mon, Jan 12, 2026, 11:18 AM
Karur stampede case: Vijay to appear before CBI today in Delhi Mon, Jan 12, 2026, 10:59 AM
Trump says only his 'morality' limits his power Mon, Jan 12, 2026, 10:56 AM