|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 07:38 PM
శ్రీలంకతో స్వదేశంలో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టును డిసెంబర్ 9న ప్రకటించారు. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధన కొనసాగుతారు. వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన తర్వాత భారత్ ఆడనున్న తొలి సిరీస్ ఇదే. షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి వరల్డ్‌కప్ స్టార్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. కొత్తగా శ్రీ చరణి, వైష్ణవి శర్మ జట్టులోకి వచ్చారు. తొలి టీ20 డిసెంబర్ 21న విశాఖపట్నంలో జరుగనుంది.
Latest News