|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 08:29 PM
మొబైల్స్ తయారీదారు లావా, భారత మార్కెట్‌లో 'ప్లే మ్యాక్స్' పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో రానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టాకోర్ ప్రాసెసర్, 8జీబీ వరకు వర్చువల్ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 50MP మెయిన్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 6జీబీ ర్యామ్ మోడల్ రూ.12,999, 8జీబీ ర్యామ్ మోడల్ రూ.14,999 ధరతో అందుబాటులో ఉండనుంది.
Latest News