|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 10:39 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని మేడూరు గ్రామంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భార్య భర్తపై గొడ్డలితో దాడి చేసింది. భర్త మొబైల్ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించడంతో ఆగ్రహించిన భార్య ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్తను స్థానికులు కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి నిలకడగా ఉంది. భర్త కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.
Latest News