|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 10:41 AM
గోవాలోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రధాన నిందితులైన సౌరభ్, గౌరవ్ లూథ్రాలను గోవా పోలీసులు థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే థాయిలాండ్‌కు పారిపోయిన వీరి పాస్‌పోర్ట్‌లను విదేశాంగ మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. లూథ్రా సోదరులు డిసెంబర్ 7న తెల్లవారుజామున థాయ్‌లాండ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గోవా పోలీసులు వీరికి లుక్-అవుట్, ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ నిందితులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
Latest News