|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 11:55 AM
అడుగడుగునా అబద్దాలు, వాస్తవ వక్రీకరణలతో సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ... విద్య,వైద్యం, వ్యవసాయం,సంక్షేమం, పోర్టుల నిర్మాణమే ప్రాధాన్యంశాలుగా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం పనిచేస్తే... అప్పులు, అసమర్థతతో చంద్రబాబు ప్రభుత్వం విధ్వంస పాలన చేస్తోందన్న బుగ్గన... ఎవరిది విజన్?, ఎవరిది విధ్వంసం అని నిలదీశారు. వైయస్.జగన్ హయాంలో పండగలా ఉన్న వ్యవసాయం... చంద్రబాబు హాయంలో దండగలా మారిందని ఆక్షేపించారు. వైయస్.జగన్ రైతును చేయిపట్టుకుని నడిపిస్తే... చంద్రబాబు అన్నదాతను అధోగతి పాల్జేసారని మండిపడ్డారు. అయినా చంద్రబాబు స్థూల ఉత్పత్తిపై అర్దం కాని లెక్కలతో మభ్యపెడుతున్నారని స్పష్టం చేశారు. మరోవైపు అప్పుల విషయంలోనూ అడ్డగోలు వాదనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ... కాగ్, ఆర్బీఐ, అసెంబ్లీ రికార్డులనూ తప్పుదారిపట్టిస్తున్నారని తేల్చి చెప్పారు. యస్ఆర్‌సీపీహాయంలో కేవలం రూ.3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే... మా హాయంలో రూ.10 లక్షల కోట్లు అబద్దాలు చెప్పడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు కేవలం 18 నెలల కూటమి పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన రూ. 2.66 లక్షల కోట్లు అప్పు ఏమైందని నిలదీశారు.
Latest News