|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 12:02 PM
కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్ అని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలతో కాలం వెళ్లదీస్తున్నారని, ఆయన పాలనలో జరిగిన గొప్పేంటో చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని విమర్శించారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన అడ్వరై్టజ్‌మెంట్, ఇది ఏ లెవల్ మోసమో.. వాళ్ల అనుకూల మీడియాలో వచ్చిన అడ్వైర్‌టైజ్‌మెంట్లను ఆయన మీడియా సమావేశంలో చూపిస్తూ ఈ 18 నెలల కూటమి పాలనా వైఫల్యాలను సతీష్‌రెడ్డి ఎండగట్టారు. చంద్రబాబు ఎప్పుడు మీడియాతో మాట్లాడినా, జగన్‌గారిని నిందించడం తప్ప ఏమీ మాట్లాడరని, ఎందుకంటే, ఆయనకు చెప్పుకోవడానికి ఏమీ లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
Latest News