|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:10 PM
వైసీపీ అధినేత జగన్ తీరు చూస్తే ఆయనకు హిందువుల పట్ల ఉన్న ద్వేషం అర్థమవుతోందని టీటీడీ బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో విమర్శించారు. తిరుమల పరకామణి చోరీ కేసు విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆయన మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.స్వామివారి హుండీ కానుకల లెక్కింపు కేంద్రమైన పరకామణిలో వందల కోట్ల రూపాయల చోరీ జరిగిందని, దానిని ఒక చిన్న దొంగతనంగా చూపించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని నెహ్రూ మండిపడ్డారు. "వేల కోట్లు దోచుకున్న మీకు పరకామణి చోరీ చిన్నదిగా కనిపించడం సహజమే. ఈ కేసులో జగన్, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల పాత్ర నూటికి నూరు శాతం ఉందనేది వాస్తవం" అని ఆయన ఆరోపించారు.గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి, పరిటాల రవి హత్య కేసుల్లో సాక్షులను ఎలా అంతమొందించారో ఇప్పుడు కూడా అదే పద్ధతిని అమలు చేస్తున్నారని జ్యోతుల నెహ్రూ విమర్శించారు. "నిజాలను నిరూపించేందుకు ప్రయత్నించేవారిని వేధించడం, భయపెట్టడం, అవసరమైతే హత్యలు చేయడం వీరికి అలవాటుగా మారింది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసును కూడా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
Latest News