|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:29 PM
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు త్వరలో భారత పర్యటనకు రానున్నారు. ఈ నెలలో జరగాల్సిన పర్యటన చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా, ప్రధాని మోదీతో నెతన్యాహు ఫోన్‌లో సంభాషించారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. త్వరలో ఇద్దరూ కలుసుకోవడానికి అంగీకరించినట్లు ఇజ్రాయెల్ పీఎంవో వెల్లడించింది. పర్యటన తేదీని ఖరారు చేసేందుకు ఇజ్రాయెల్ అధికారులు భారత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు.
Latest News